Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెక్స్ రాకెట్ లో బీజేపీ మహిళా నేత సునీతా వర్మ!

BJP Leader Sunita Varma Arrested in Sex Rocket
  • రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ లో బహిర్గతం
  • 17 ఏళ్ల బాలిక ఫిర్యాదుతో వెలుగులోకి
  • సంబంధమున్న కాంగ్రెస్ నేత పూనమ్ పరారీలో
రాజస్థాన్ బీజేపీ మహిళా మోర్చా నేత సునీతా వర్మ సెక్స్ రాకెట్ లో చిక్కుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సవాయి మాధోపూర్ లో 17 ఏళ్ల యువతి, వ్యభిచార గృహం నుంచి తప్పించుకుని, పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేయగా, ఈ రాకెట్ బయటపడింది. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న సునీత, స్వయంగా ఈ దందాను నడిపిస్తోందని తేల్చిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

ఈ విషయం బయటకు రాగానే, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ సెక్స్ రాకెట్ లో భాగం పంచుకున్న ముగ్గురు గవర్నమెంట్ ఉద్యోగినులు, మరో మహిళను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసును లోతుగా విచారిస్తున్నారు. ఈ కేసుతో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నేత పూనమ్ చౌదరితో పాటు, మరో ఇద్దరికి కూడా ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ పరారీలో ఉన్నారని, త్వరలోనే వీరిని అరెస్ట్ చేస్తామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
Sex Rocket
Sunita Varma
Poonam Chowdhari
Rajasthan Police

More Telugu News